TG: హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లోని ఓ స్కూల్లో దారుణం జరిగింది. ఓ విద్యార్థికి ప్రిన్సిపల్ గుండు కొట్టించాడు. జుట్టు ఎక్కువగా ఉందని కత్తిరించుకోవాలని ప్రిన్సిపల్ ఆ విద్యార్థికి సూచించాడు. అయితే మొక్కు ఉందని చెప్పినా పట్టించుకోకుండా గుండు కొట్టించారని విద్యార్థి ఆరోపించాడు. ప్రిన్సిపల్ వైఖరికి నిరసనగా పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.