AKP: జిల్లాలో అక్రమ ఆయుధాలను కలిగి ఉండటం, తయారు చేయడం లేదా రవాణా చేయడం చట్టవిరుద్ధమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. అనుమతి లేకుండా నాటు తుపాకులు వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ ఉన్న ఆయుధాలను ఇతరులకు ఇవ్వడం, గాలిలో కాల్పులు జరపడం వంటి చర్యలపై కూడా లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు.