TPT: నాయుడుపేట పట్టణంలోని జడ్పీ బాలుర క్రీడా ప్రాంగణంలో ఈనెల 11న దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహించనున్నారు. నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాలకు చెందిన అర్హులైన వారు అవసరమైన పత్రాలతో హాజరై శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.