TPT: వరదయ్యపాలెం మండలంలోని బత్తలవల్లం, చేదులపాకం, విట్టయ్యపాలెం ప్రాంతాల్లో ఎర్ర మట్టి గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రజలకు ముప్పు ఏర్పడుతోందని విట్టయ్యపాలెం మహిళలు టిప్పర్లను అడ్డుకుని నిరసన తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.