GNTR: ఫిరంగిపురం గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములూరిపాడుకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్పై వెళ్తున్న అతడిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు 108 ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఆపకుండా వెళ్తున్న లారీని స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.