PPM: ప్రభుత్వానికి సంబంధించిన వివిధ న్యాయపరమైన అంశాలు, కోర్టు కేసుల పరిష్కారంలో అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత గడువులోగా కౌంటర్లు దాఖలు చేయాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన ఛాంబర్లో సాలూరు, పాలకొండ, పార్వతీపురం ప్రాంతాలకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లుతో సమీక్ష చేశారు.