ఇటీవల చెన్నైలో ఓ వివాహ రిసెప్షన్లో విజయ్, త్రిష జంటగా కనిపించి సందడి చేశారు. వీరిద్దరూ ఒకే కారులో, మ్యాచింగ్ దుస్తుల్లో రావడం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో త్రిష రాజకీయ అరంగేట్రంపై ప్రచారం ఊపందుకుంది. ఆమె విజయ్ ‘TVK’ పార్టీలో చేరి, చెన్నై నుంచి MLAగా పోటీ చేస్తారని తెలుస్తోంది. 15 ఏళ్ల క్రితమే తనకు CM అవ్వాలని ఉందన్న త్రిష వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.