VSP: జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి రూ.1,066.19 కోట్ల ఆదాయం లభించింది. జిల్లాలోని తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఈ ఆదాయం నమోదైంది. ఫిబ్రవరి వరకు ప్రభుత్వం నిర్దేశించిన రూ.1,445.7 కోట్ల లక్ష్యంలో 73.75 శాతం సాధించారు. గత ఏడాది ఇదే కాలంలో రూ.949.77 కోట్లు మాత్రమే వచ్చిందాని అదికారులు తెలిపారు.