దేశంలోని వార్తా ఛానళ్లలో పెరుగుతున్న సంచలనాత్మక ధోరణిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. న్యూస్ ఛానళ్ల టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(TRP) నివేదికలను 4 వారాల పాటు, ఆదేశాలు ఇచ్చే వరకు నిలిపివేయాలని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC)ను ఆదేశించింది. రేటింగ్ కోసం పోటీ పడుతూ, బాధ్యతను విస్మరించి వార్తలను ప్రసారం చేయడం సరికాదంది.