BHPL: జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నాలుగవ జిల్లా స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను నేటి నుంచి 8 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా SP సంకీర్త్ గౌడ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 194 మంది పోలీస్ సిబ్బంది ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. పురుషులు, మహిళా సిబ్బందికి వేర్వేరుగా క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి పోటీలు నిర్వహించనున్నారు.