ఇటీవల మలయాళ చిత్రం ‘సర్వం మాయ’లో ప్రీతి ముకుందన్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె బాలీవుడ్లోకి అడుగుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కార్తిక్ ఆర్యన్ ‘నాగ్జిల్లా’ సినిమాలో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలోని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసినట్లు సమాచారం. మృగ్దీప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.