WGL: సంగెం మండల కేంద్రంలో ఆస్తి తగాదాల కారణంగా దొంగిలించిన పందుల కేసును ఛేదించారు. గురువారం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ. లక్షల విలువైన 25 పందులను స్వాధీనం చేసుకున్నట్లు పర్వతగిరి సీఐ రాజగోపాల్ తెలిపారు. రాయపురం రాజు తన బాబాయి కొమురయ్యపై పగతో, బంధువులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు.