KMM: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వైరా ఎస్సై పవన్ హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం బ్లూ కోల్ట్ పోలీసులు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు పెండింగ్లో ఉన్న జరిమానాలను వసూలు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు.