భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధనలు నిర్వహించిన అనంతరం ఉత్సవ మూర్తులను మేళతాళాలతో బేడా మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్ సేన పూజ పుణ్యహవాచనం కంకణధారణ గావించి సీతారాముల కల్యాణాన్ని జరిపించారు