SDPT: ప్రేమించిన యువతి దూరమైందని UPకి చెందిన ప్రదీప్ కుమార్ (మేనేజర్) ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొండపాక మం. వెలికట్ట శివారులోని కంపెనీలో పనిచేస్తూ దుద్దెడలో ఉంటున్న ప్రదీప్, గతంలో తనతో పనిచేసిన యువతిని ప్రేమించాడు. ఏడాది క్రితం ఆమె కంపెనీలో ఉద్యోగం మానేసి వెళ్లినప్పటి నుంచి ఆందోళనగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.