సత్యసాయి: మంగళగిరిలోని TDP కార్యాలయంలో మడకశిర నియోజకవర్గ క్లస్టర్ కన్వీనర్ల శిక్షణ తరగతులు గురువారం జరిగాయి. మడకశిర, గుడిబండ, రొళ్ల, అగళి, అమరాపురం మండలాల నుంచి కన్వీనర్లు హాజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై నాయకులు వీరికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై శిక్షణ ఇచ్చారు.