ATP: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న బాలికలు మాత్రమే అర్హులు. ప్రతి పాఠశాలలో 40 సీట్లు అందుబాటులో ఉండగా.. బడి బయట ఉన్నవారు, అనాథలు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తారు.