NZB: బోధన్ పట్టణంలో రాత్రి సమయంలో బుల్లెట్ వాహనం నడుపుతూ అధిక శబ్దంతో (సౌండ్ పొల్యూషన్) డ్రైవ్ చేస్తున్న ఓ మైనర్‌ను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. అధిక శబ్దంతో వాహనాలు నడపడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందన్నారు. ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధమని సీఐ హెచ్చరించారు.