హైదరాబాద్: 28°C
క్రైమ్

కోడలిని కాపాడబోయి అత్తమామలు మృతి

Advertisement

AP: నెల్లూరు జిల్లా సైదపురం మండలం రాజుపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై కోడలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో అత్తమామలు సునీత, రవి విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. కోడలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement