సత్యసాయి: పరిగి మండలం శ్రీరంగరాజుపల్లిలో శ్రీ సద్గురు తాతయ్య స్వామి దర్గాలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల టీడీపీ కన్వీనర్ గోవింద్ రెడ్డి పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫై మ్యాన్ కమిటీ సభ్యులు సూర్యనారాయణ, సోమప్ప, బాలాజీ, సంజీవరాయప్పతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.