JN: జిల్లా కేంద్రంలో మంగళవారం ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్‌ను టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు మరాఠీ దినేష్, బాల్దే బానుష్గా గుర్తించారు. టాటా ఏసీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.