T20 ప్రపంచకప్లో తొలి సెమీఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. దీంతో రేపటి మ్యాచ్లో బలమైన సఫారీలను కివీస్ ఎలా అడ్డుకుంటుందో చూడాలి. LIVE: 7PM, జియోహాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్