AP: హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించడమే తమ లక్ష్యమని మంత్రి మండిపల్లి తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులకు రూ.6,613 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. హంద్రీనీవా ద్వారా 738 కి.మీ. దూరంలోని కుప్పానికి నీరు తరలిస్తున్నట్లు చెప్పారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల రూ.205 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.