NLR: కావలిలో ఈనెల 23న పూనూరు వారి వీధి హైమా రైస్ మిల్లు వద్ద జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నిందితులు సాలేటి లక్ష్మణరావు, ప్రేమ్ కుమార్లను అరెస్ట్ చేసి వారి నుంచి 160 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.