TG: భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రహదారులపై గుంతలను పూడ్చివేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు నాణ్యమైన, తాజా లడ్డూలు ఇవ్వాలని పేర్కొన్నారు. వారం రోజుల ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ పంపిణీకి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.