GNTR: నగరంపాలెం కోదండరామయ్య నగర్ 4వ లైనులో ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. నోటి నుంచి నురగలు వస్తూ పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆ వ్యక్తి వివరాలు తెలిసిన వారు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలనీ కోరారు.