»Srileela In Ustad Bhagat Singh What About Pooja Hegde
Ustad Bhagat Singh లో శ్రీలీల.. మరి పూజా హెగ్డే!?
Ustad Bhagat Singh : యంగ్ బ్యూటీ శ్రీలీల లక్ మామూలుగా లేదనే చెప్పాలి. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ బెస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది ఈ హాట్ బ్యూటీ. ఇక ధమాకాతో.. హీరోలు అమ్మడు కావాలంటే.. మేకర్స్‌కు మరో ఆప్షన్ లేకుండా పోయింది.
యంగ్ బ్యూటీ శ్రీలీల లక్ మామూలుగా లేదనే చెప్పాలి. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ బెస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది ఈ హాట్ బ్యూటీ. ఇక ధమాకాతో.. హీరోలు అమ్మడు కావాలంటే.. మేకర్స్‌కు మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఈ బ్యూటికీ ఫుల్లుగా డిమాండ్ పెరగడంతో.. పారితోషికం కూడా భారీగా పెంచేసింది. అయినా కూడా అమ్మడిని వదులుకునే పరిస్థితిలో లేరు. ఇప్పటికే ఆమె చేతిలో అరడజను పైగానే సినిమాలున్నాయి. రామ్, బోయపాటి, నితిన్ ‘జూనియర్’, అనగనగా ఒక రాజు వంటి సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్‌తో బిజీగా ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డేతో స్కీన్ షేర్ చేసుకుంటోంది. అయితే ఎస్ఎస్ఎంబీ 28లో సెకండ్ ప్లేస్‌లో ఉన్న శ్రీలీల.. ఇప్పుడు పూజా హెగ్డేకి చెక్ పెట్టేసిందనే న్యూస్ వైరల్‌గా మారింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ కొట్టేసిందట శ్రీలీల. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్నారు పవన్. ఇటీవలె ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అయితే ముందు నుంచి ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా ఫైనల్ అయిందని వినిపించింది. అయితే ఇప్పుడు శ్రీలీలను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇది గాసిప్ మాత్రమే.. కానీ ఒకవేళ పవర్ స్టార్‌తో శ్రీలీల ఛాన్స్ కొట్టేస్తే మాత్రం బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఇకపోతే.. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. మార్చిలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో చూడాలి.