కుక్క కాటు తర్వాత ముందుగా భయపడకూడదు. కుక్క కరిచిన చోట గాయాన్ని సబ్బుతో 10 నుంచి 15 నిమిషాల పాటు శుభ్రమైన నీటితో కడగాలి. తర్వాత వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. గాయం తీవ్రతను బట్టి డాక్టర్లు ఇంజెక్షన్లు ఇస్తారు. రేబిస్తో పాటు టెటనస్ వచ్చే ప్రమాదం ఉన్నందున టెటనస్ షాట్ కూడా తీసుకోవాలి. కనీసం 4 నుంచి 5 మోతాదులు తీసుకోవాలి. ఇది రేబిస్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.