BPT: నిజాంపట్నం బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ (MPC, BiPC, CEC) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయన్ని ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లను కూడా భర్తీ చేసున్నామని వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.