AP: విశాఖ స్టీల్ ప్లాంటులో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కేంద్రం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(VRS)ను ప్రకటించింది. VRS కోరుకునే ఉద్యోగి సంస్థలో 15 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసి ఉండాలని.. 45 ఏళ్ల లోపు వయసు ఉండాలని నిబంధన పెట్టింది. VRS కోరుకునే వారు ఈనెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. VRS పేరుతో దగా చేస్తున్నారని.. 2,500 మందిని ఇంటికి పంపడానికి కుట్రలు చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.