WGL: మంత్రి కొండా సురేఖను రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు కె.కృష్ణమాచారి, నేతలు కలిశారు. అనంతరం తాను గీసిన మంత్రి చిత్రపటాన్ని అధ్యక్షుడు బహూకరించారు. కృష్ణమాచారి చిత్రకళా నైపుణ్యాన్ని మంత్రి సురేఖ ప్రశంసించారు. ఖాళీ సమయాల్లో కళాతృష్ణ కలిగిన విద్యార్థులకు కృష్ణమాచారి ఉచితంగా చిత్రకళను బోధిస్తున్నాడని తెలుసుకుని అభినందించారు.