ప్రతిష్ఠాత్మక సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్లో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుతోంది. మలేషియాను చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. భారత జట్టు ధాటికి మలేషియా 4-2తో ఓటమి పాలైంది. దాంతో టీమిండియా 9 పాయింట్లతో గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచింది.