KMM: కూసుమంచి మండల ఏవో వాణి మంగళవారం తమ సిబ్బంది మానసతో కలిసి స్థానిక పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో వాణి రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. చేతికొచ్చిన పంట వర్ష ధాటికి నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రసాయనిక ఎరువులు కాకుండా ప్రకృతి సిద్ధమైన ఎరువులను వాడి పంటలకు అధిక దిగుబడి తీసుకురావాలన్నారు.