TG: బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన తర్వాత.. ముందు మురికినీళ్లను శుద్ధి చేయండని డిమాండ్ చేశారు. రసాయన వ్యర్థాలను శుద్ధి చేస్తేనే బాగుపడుతుందని సూచించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, చేస్తున్న పద్ధతికి వ్యతిరేకమన్నారు. ప్రజా సమస్యల మీద తాను కొట్లాడుతున్నానని, మీ సహకారం లేనిదే అది పూర్తి కాదని చెప్పారు.