TG: కరీంనగర్ BRS ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తల్లి నర్సమ్మ మృతి చెందారు. వృద్ధురాలైన ఆమె అనారోగ్య కారణాలతో మరణించారు. నర్సమ్మ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సంతాపం ప్రకటించారు. గంగుల కుటుంబసభ్యులకు పలువురు BRS నేతలు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.