NLG: ఈ నెల 17న చిట్యాల మండలం, గుండ్రాంపల్లి శివారులో బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. శేఖర్ (34) ఫిబ్రవరి 17న కూలి పని కోసం భైరవునిబండ నుంచి మిత్రుడితో చౌటుప్పల్‌కు వెళుతుండగా గుండ్రాంపల్లి వద్ద బైకు అదుపుతప్పి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ.. మృతి చెందినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.