HNK: కమలాపూర్ మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా భూపతి హరికృష్ణ అనే వ్యక్తి అక్రమంగా గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం రాత్రి హనుమకొండ టాస్క్ఫోర్స్ దాడులు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుండి సుమారు రూ.8,370 విలువగల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.