GNTR: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మండల రైల్వే అధికారి రామకృష్ణ సూచనలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డివిజనల్ రైల్వే ఆసుపత్రి వైద్యాధికారుల నేతృత్వంలో వైద్య పరీక్షలు చేసేలా కార్యాచరణ రూపొందించారు.