NLR: గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉదయగిరి పట్టణంలోని దివార్ బావి వీధికి చెందిన షేక్ షాహిదా ఇంటి పై కప్పు బాగా నానడంతో బుధవారం అర్థరాత్రి కొంత భాగం కూలిపోయింది. కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కొంతమేర చిరిగి కింద పడింది. దీంతో ప్రమాదాన్ని గమనించిన ఆమె వెంటనే సభ్యులతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.