బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రద్దయిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలని వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై విపక్షాలతోపాటు రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది. సొంత పార్టీ కూడా ఆమె వ్యాఖ్యలతో సంబంధం లేదని పేర్కొంది. దీంతో క్షమాపణలు చెప్పిన ఆమె.. తాను కళాకారిణి మాత్రమే కాకుండా BJP ఎంపీననే విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుండేది. అయితే, ఇలాంటి వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకోవడం కొత్తేమీ కాదు.