ఈ రోజుల్లో ప్రేమ వ్యవహారాలు కామనే కదా. యువతీయువకులు ప్రేమలో పడటం కామన్. తన లవర్ కోసం యువకుడు ఎన్నో పాట్లు పడుతుంటాడు. తనను కలవడం కోసం చాలా ఇబ్బందులు పడుతుంటాడు. తాజాగా ఓ యువకుడు.. తన లవర్ను కలిసేందుకు వెళ్లి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆదివారం రాత్రి.. తన ప్రేయసిని కలిసేందుకు ఓ యువకుడు అమ్మాయి గ్రామానికి వెళ్లాడు. అక్కడ తన ఇంట్లోకి వెళ్లబోతుండగా చూసిన స్థానికులు అతడిని పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు అతడిని తీవ్రంగా కొట్టారు. చివరకు అతడి నోట్లో మూత్రం పోశారు. అతడితో మూత్రం తాగించారు.
ఈ విషయం తెలుసుకొని ఆ యువకుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని అతడిని వదిలేయాలని ప్రాధేయపడ్డారు. చివరకు ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. కానీ.. వైరల్ అయిన వీడియో ఆధారంగా బాధితుడి దగ్గరకు వెళ్లిన పోలీసులు.. అతడి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. యువకుడిని చితకబాది మూత్రం తాగించిన ఆరు వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. యువతిని దొంగచాటుగా కలవడానికి వెళ్లినందుకు ఆ అమ్మాయి మైనర్ అయినందున బాధితుడిపై కూడా పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.