»Budget 2024 Announcements Know Which Products Are Cheaper A
Budget : కేంద్ర బడ్జెట్.. ధరలు తగ్గే వస్తువులివే
నేడు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో పలు వస్తువులపై ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. ఫలితంగా ధరలు తగ్గే వస్తువుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Budget 2024 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ ఉదయం పార్లమెంటులో 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ని(Budget) ప్రవేశ పెట్టారు. కొన్ని వస్తువులపై ట్యాక్స్‌లు, కస్టమ్స్ డ్యూటీలను తగ్గించారు. ఈ నేపథ్యంలో ధరలు తగ్గే వస్తువుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* స్మగ్లింగ్‌ని అరికట్టేందుకుగాను బంగారం, వెండి లోహాల దిగుమతిపై ఆరు శాతం కస్టమ్స్ ట్యాక్స్‌ని తగ్గించారు. ప్లాటినంపైన సైతం 6.5 శాతం కస్టమ్స్ ట్యాక్స్‌ని తగ్గించారు. ఈ విషయమై జెమ్స్ అండ్ జ్యువెలరీ పరిశ్రమలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకుని కేంద్రం ఇప్పుడు వీటిపై పన్నును తగ్గించింది. వీటితో పాటుగా ఆర్టిఫిషియల్ వజ్రాల పైనా పన్నును తగ్గించింది.
* రొయ్యలు, చేపల మేతపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 5శాతం తగ్గించింది. ఆ ప్రభావంతో వీటి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
* మూడు రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించింది. ఫలితంగా వాటి ధరలు తగ్గుతాయి.
* మొబైల్ ఫోన్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ని తగ్గించింది. దీంతో వీటన్నింటి ధరలు తగ్గనున్నాయి.
* లెదర్, ఫుట్‌వేర్‌పై ట్యాక్స్‌ని తగ్గించింది. అలాగే సోలార్ ఎనర్జీకి సంబంధించిన విడి భాగాలపై ట్యాక్స్‌ని పెంచబోమని ప్రకటించింది.
* సైకిళ్లు, బొమ్మలు, లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు సైతం తగ్గుతాయి.