»Anjali Says Thanks To Nandamuri Balakrishna Despite Controversy
Anjali : వివాదానికి ఫుల్స్టాప్? బాలయ్యతో ఎంతోకాలంగా స్నేహం ఉందన్న అంజలి!
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ అంజలిని గెంటిన వీడియో నెట్టింట వైరల్ అయి వివాదానికి దారి తీసింది. దీంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే అన్నట్లుగా అంజలి ఇండైరెక్ట్‌గా ఓ ట్వీట్ చేశారు. ఏమనంటే?
Gangs of Godavari : నటి అంజలితో బాలకృష్ణ వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. స్టేజ్‌పై ఉన్న హీరోయిన్ అంజలిని ఆయన చేతితో నెట్టినట్లు చేశారు. దీంతో కాస్త తడబడిన తెలుగు బ్యూటీ తర్వాత నవ్వేసి కవర్ చేసుకుంది. దీంతో ఆ క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. స్టేజ్ మీదున్న హీరోయిన్‌తో అలా ప్రవర్తించడం ఏమిటని నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు సైతం గరం గరం వ్యాఖ్యలు చేశారు.
ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టాలన్నట్లుగా హీరోయిన్ అంజలి(Anjali) ఇండైరెక్ట్‌గా ఓ ట్వీట్ చేశారు. గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలకృష్ణ హాజరైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆయనతో తనకు ఎప్పటి నుంచో స్నేహం ఉందంటూ రాసుకొచ్చారు. తమ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉందంటూ రాశారు. అలాంటి వ్యక్తితో స్టేజ్‌ని పంచుకోవడం ఎంతో అద్భుతంగా ఉందంటూ పేర్కొన్నారు. దీంతో ఆ వివాదానికి(Controversy) ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఆమె ఈ విధంగా ట్వీట్ చేశారంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఈ విషయమై గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari) హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) సైతం స్పందించారు. అసలు అక్కడ జరిగింది వేరు అంటూ చెప్పుకొచ్చారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చే క్రమంలోనే బాలయ్య అంజలిని పక్కకు జరగమన్నారన్నారు. దాన్ని అంజలి కూడా సరదాగానే తీసుకున్నారని చెప్పారు. సోషల్ మీడియా మాత్రం ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని అన్నారు. ముందు, వెనుకలు కట్ చేసి ఆ చిన్న క్లిప్‌ని పదే పదే వైరల్ చేశారని, ట్రోల్స్ చేశారని అన్నారు.
I want to thank Balakrishna Garu for gracing the Gangs of Godavari pre-release event with his presence.
I would like to express that Balakrishna garu and I have always maintained mutual respect for eachother and We share a great friendship from a long time. It was wonderful to… pic.twitter.com/mMOOqGcch2