Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 25th)..శుభవార్తలు వింటారు.
ఈ రోజు(2024 April 25th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
సన్నిహితులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. నూతన పనులను ప్రారంభించడం మంచిదికాదు. ఇంటిలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.
వృషభం
స్త్రీల మూలకంగా ధనలాభం ఉంది. మొదలుపెట్టిన పనుల్లో విజయం పొందుతారు. శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
మిథునం
మంచి అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. బంధువుల సహాయ, సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం
కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వృధా ప్రయాణాలు చేస్తారు. బంధు, మిత్రులతో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీమీగరంగాల్లో సహనం వహించక తప్పదు.
సింహం
కొత్త వ్యక్తులను నమ్మరాదు. సంఘంలో గౌరవం పోకుండా జాగ్రత్తపడటం మంచిది. మొదలుపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దేవుడిని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. సొదరులతో జాగ్రత్తగా ఉండండి.
కన్య
కొత్త కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అకాలభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యం ఆడరాదు. భయాందోళనలకు గురౌతారు.
తుల
కొంత లాభం ఉంటుంది. వృథాప్రయాణాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందుతారు. అప్పుకోసం ప్రయత్నిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహకారం లభిస్తుంది.
వృశ్చికం
విదేశయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అప్పు సులభంగా లభిస్తుంది. ఎలర్జీతో బాధపడేవారు కాస్త జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రయత్నకార్యాలకు ఇబ్బందులు ఎదురౌతాయి.
ధనుస్సు
కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. వ్యవసాయంలో మంచి లాభాలను పొందుతారు. మొదలు పెట్టిన పనులన్ని ఫలిస్తాయి.
మకరం
శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అన్నివిధాలా సుఖం లభిస్తుంది.
కుంభం
గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల వలన లాభం పొందుతారు. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. సన్నిహితులను గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు.
మీనం
ఆర్థిక ఇబ్బందులు ఎదరౌతాయి. మీమీరంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పు కోరుకుంటారు. ఒక మంచి అవకాశం చేజారుతుంది. ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది.