E.G: జిల్లాలోని రాజానగర మండలం కానవరంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 25న కోరాడ శివలక్ష్మి ఇంట్లో 82 గ్రాముల బంగారం, 45 తులాల వెండిని అపహరించిన నిందితుడు జామీ వీరగణేశ్ను శనివారం కాకినాడలో అరెస్ట్ చేసినట్లు ఇన్ఛార్జ్ DSP బి.రామకృష్ణ తెలిపారు. క్లూస్ టీం ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.