MHBD: BRS MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు శనివారం హైదరాబాద్ హిమాయత్ నగర్లోని టీటీడీ దేవస్థానాన్ని సందర్శించారు. నేడు తన పెళ్లిరోజు సందర్భంగా తన సతీమణి సంధ్యారాణితో కలిసి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు.