TPT: తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. హీరోయిన్ శ్రియ, బెంగాలీ హీరో జీత్ (జితేంద్ర మద్నాని) తమ కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్య విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల శ్రియతో పలువురు భక్తులు ఫోటోలు దిగారు.