BDK: పాల్వంచకు చెందిన మేకల విక్రాంత్ అండర్-10 విభాగంలో నేషనల్ ఆర్చరీ ఛాంపియన్ షిప్లో కాంస్య పతకం సాధించాడు. ఏపీ గుంటూరులో జరిగిన ఇండియన్ రౌండ్ విభాగంలో పోటీ పడి, తన అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, కోచ్ కళ్యాణ్, విక్రాంత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.