TG: HYDలో భారీ వర్షాలకు పాతబస్తీలోని ఛత్తాబజార్ దివాన్ దేవిడీ వద్ద ఉన్న చారిత్రక కమాన్ భాగం కుప్పకూలింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ పురాతన కట్టడం కూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో పాతబస్తీలోని చారిత్రక కట్టడాల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
భాగ్యనగరంలో కూలిన చారిత్రాక కమాన్!


