హైదరాబాద్: 28°C
వార్తలు

గ్రావెల్ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రు నియోజకవర్గ పరిధిలోని పమిడిముక్కల మండలం కృష్ణాపురం శివారు ముసలనాయకపాలెం గ్రామంలో రూ.15.35 లక్షల వ్యయంతో గ్రావెల్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఆయనతో పాటు సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.